calender_icon.png 3 November, 2024 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్స్ ఉద్యోగులకు మస్క్ షాక్!

03-11-2024 01:03:52 AM

న్యూఢిల్లీ, నవంబర్ 2: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్(ట్విట్టర్) లోని ఇంజినీరింగ్ విభాగంలో ఉద్యోగులకు పెద్దమొత్తంలో లేఆఫ్‌లు ప్రకటించినట్లు తెలుస్తోంది. తాజాగా మెయిళ్ల ద్వారా ఉద్యోగులకు సమాచారం అందించినట్లు సమాచారం. అయితే ఉద్యోగుల తొలగింపుపై యాజమాన్యం బహిరంగంగా స్పందించలేదు. 2022 అక్టోబర్‌లో ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పుడు కంపెనీ విలువ సుమారు 44 బిలియన్ డాలర్లు. అప్పట్లో ఈ సంస్థలో ఉన్న 6,000 మంది ఉద్యోగుల్లో దాదాపు 80 శాతం మందిని తొలగించారు.

ఈ ఏడాది జనవరిలో మరో వెయ్యి మంది సేఫ్టీ సిబ్బందిని కూడా పక్కనబెట్టారు. కాగా సంస్థలో వస్తున్న వివిధ ఒడిదుడుకుల కారణంగా ప్రస్తుతం ఎక్స్ విలువ 9.4 బిలియన్ డాలర్ల(రూ.79 వేల కోట్లు)కు పడిపోయింది. ఎలాన్ మస్క్ సామాజిక మాధ్యమమైన ఎక్స్‌ను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన సోషల్ మీడియా ట్రూత్ అధిగమించినట్లు తెలుస్తోంది.