calender_icon.png 27 October, 2024 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మస్క్‌నా.. మజాకానా

27-10-2024 12:33:54 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను గెలిపించడానికి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ విశ్వప్రయత్నాలు చేస్తున్నా రు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే క్యాబినెట్‌లోకి మస్క్‌ను తీసుకుంటానని ట్రంప్ ప్రకటించారు. ఇందులో భాగంగా ట్రంప్‌నకు మద్దతి చ్చే రిజిస్టర్డ్ ఓటర్లలో రోజుకు ఇద్దరికి డబ్బులు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. రోజుకు ఒకరికి రూ.8 కోట్లు పంచుతానని చెప్పాడు. డబ్బులు పంచడం ఎన్నికల చట్టాలను ఉల్లంఘించడమేనని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు న్యాయశాఖ వెల్లడించినా మస్క్ వాటిని బేఖాతరు చేస్తున్నారు. ఓటర్లకు డబ్బులు పంచిన ట్లు తేలితే మస్క్‌కు ౫ ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నా రు. ట్రంప్ ప్రచారానికి మస్క్ దాదాపు రూ.1,190 కోట్లు ఖర్చు చేసినట్లు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. ట్రంప్‌నకు మస్క్ మద్దతుతో పాటు భారీగా విరాళాలు ఇస్తున్నారు. మస్క్ ఇటీవల మరో రూ. 470 కోట్లను అందజేశారు.