calender_icon.png 8 January, 2025 | 2:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగీతకారులకు అవార్డుల ప్రదానం

06-01-2025 12:00:00 AM

హైదరాబాద్‌లో ఆదివారం కళావేదిక అవార్డ్స్ 59వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. శ్రీ చరణ్ కమ్యూనికేషన్స్ అధినేత బస్సా శ్రీనివాస్ గుప్త, భువన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో 2024లో విడుదలైన సినిమాలకు పనిచేసిన గీత రచయితలు, గాయనీగాయకులు, సంగీత దర్శకులకు అవార్డులు అందించా రు.

ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కల్వ సుజాత గుప్త, దర్శకులు ముప్పలనేని శివ, ఇంద్రగంటి మోహన్ కృష్ణ, సంగీత దర్శకులు ఆర్‌పీ పట్నాయక్, ఎమ్‌ఎమ్ శ్రీలేఖ, సింగర్ కౌసల్య, నందమూరి రూపాదేవి, కొల శ్రీనివాస్, గంధం రాములు, ఎల్ ప్రసన్నకుమార్, వినయ్ హరిహరణ్ పాల్గొన్నారు.