calender_icon.png 20 April, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలకూటవిషంలా మూసీ!

28-03-2025 12:12:36 AM

  • నదిలోకి దర్జాగా రసాయనాలు

నురగలు కక్కుతున్న నీరు 

డ్రైనేజీ నీరు కలుస్తున్నా పట్టించుకునే నాథుడు కరువు 

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం 

మూసి ప్రక్షాళనను పట్టించుకోని సర్కారు 

రాజేంద్రనగర్, మార్చి 27 (విజయ క్రాంతి): ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో ప్రవహించే మూసినది ప్రస్తుతం కాలకూట విషం గా మారింది. కొన్నిచోట్ల రసాయనాలు కలవడంతో మూసిలోని నీరు నురగలు కక్కుతోంది. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుం చి భారీగా డ్రైనేజీ నీరు మూసిలో కలవడంతో పూర్తిగా దుర్గంధ భరితంగా మారు తుంది.

మూసీ నదిని ప్రక్షాళన చేసి స్వచ్ఛమైన నీటిని పారిస్తామని కాంగ్రెస్ సర్కారు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తుందని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

గండిపేట చెరువు నుంచి నార్సింగి వరకు కొంతమేర మూసిలో ప్రవహిస్తున్న నీరు బాగానే ఉన్న గోల్కొండ డివిజన్ పరిధిలోని ప్రఖ్యాతిగాంచిన తారమతి బారదరి సమీపంలో భారీ ఎత్తున డ్రైనేజీ నీరు మూసినదిలో కలుస్తుంది. షేక్పే ట, మణికొండ, టోలిచౌకి తదితర ప్రాంతాల నుంచి డ్రైనేజీ నీరు వచ్చి చేరుతుంది. అదేవిధంగా లంగర్ హౌస్ లో  కూడా పలు ప్రాంతాల్లో డ్రైనేజీ నీరు యథేచ్ఛగా మూసీలో కలుస్తుంది. 

- నల్లగా మారిన బండలు 

 హిమాయత్ సాగర్ చెరువు నుంచి వచ్చే ఈసీ నదిలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రిచ్మండ్ విల్లాస్ వెనకాల ప్రవహిస్తున్న నదిలో కొన్నిచోట్ల రసాయనాలు కలవడంతో నీరు నురగలు కక్కుతోంది. అదేవి ధంగా రసాయనాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మూసినదిలో బండలు పూర్తిగా నల గా మారాయి అంటే పరిస్థితిని ఊహించవచ్చు. ఈసీ నదిలో కూడా వివిధ ప్రాం తాల్లో డ్రైనేజీ నీరు కలవడంతో పూర్తిగా దుర్గంధ భరితంగా మారింది.

లంగర్ హౌస్, అత్తాపూర్ కలిసే బ్రిడ్జి సమీపంలో గండిపేట నుంచి వచ్చే మూసీ నది, అదేవిధంగా హిమాయత్ సాగర్ నుంచి వచ్చే ఈసీ నదు లు కలుస్తున్నాయి. అంతకుముందు, ఆ తర్వాత లంగర్ హౌస్ లో కూడా డ్రైనేజీ మూసి నదిలో కలుస్తుంది.

ఈ నేపథ్యంలో మూసీ నది పరివాహక ప్రాంతంలో అత్తాపూర్ డివిజన్ పరిధిలోని రాజ పుష్ప అపార్ట్మెంట్, అదేవిధంగా లక్ష్మీ నగర్ పార్కు సమీపంలో మూసి నది గుంతల్లో మురుగునీరు భారీగా నిల్వ ఉండడంతో ముక్కుపుట లు అదిరే విధంగా అతి తీవ్ర మైన దుర్వాసన వస్తుంది.

ఈ నేపథ్యంలో మూసీ నది అంటే మురుగు అన్న విధంగా మారిపోయింది. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమ న్వయం ఏమాత్రం లేకపోవడంతో మూసి నది రోజురోజుకు కంపు కొడుతుందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వంతోపాటు ఆయా శాఖల అధికారులు కళ్ళు తెరిచి మూసీ నదిని శుభ్రంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.