calender_icon.png 28 December, 2024 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హన్ నది తరహాలో మూసీ అభివృద్ధి

22-10-2024 03:26:40 AM

  1. మంత్రులు పొంగులేటి, పొన్నం
  2. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సియోల్‌లో పర్యటన

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 21(విజయక్రాంతి): హన్ నది తరహాలో మూసీ నదిని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ అన్నారు. మూసీ సుందరీకరణే లక్ష్యంగా ఐదు రోజుల పర్యటన నిమిత్తం సియోల్ నగరానికి వెళ్లిన రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం..

చియోంగ్ గయే చేయన్(హన్) నది పరీవాహక ప్రాంతం, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే వేస్ట్ టు ఎనర్జీ(డబ్ల్యూటీఈ) మాపో రిసోర్స్ రికవరీ ప్లాంట్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ మేరకు మంత్రులు పొంగులేటి, పొన్నం సోమవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ..

గతంలో హన్ నది పరీవాహక ప్రాంతాలు కాలుష్యంతో నిండి ప్రజలు జీవించలేని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ఆ నది పునరుజ్జీవంతో నూతన కళను సంతరించుకుందని తెలిపారు. 2003 అక్టోబర్ 1న ఆ నదిని సంపూర్ణంగా తీర్చిదిద్దాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించి.. పనులకు శ్రీకారం చుట్టిందన్నారు.

అయితే అక్కడి ప్రజలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని.. జీవనోపాధి లభిస్తుందని ప్రభుత్వం వారిని ఒప్పించి రెండేండ్లలోనే (2005 అక్టోబర్ 1 నాటికి) ప్రాజెక్టును పూర్తి చేసిందని చెప్పారు. దీంతో అక్కడ గతంలో ఎన్నడూ చూడని కొత్త సొగసులు చేకూరాయన్నారు.

ప్రపంచమే విస్తుపోయేలా భారీ కట్టడాలు, సుందరీకరణతో పర్యాటకం అభివృద్ధి చెందిందని చెప్పారు. అంతకు ముందు నదీ తీరంలో బురద, అపరిశుభ్రతతో ఉన్న ఆ నది పరిసరాల్లో సరికొత్త లోకం ఆవిషృతమైందన్నారు. పర్యాటకులు కూడా వచ్చి ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారని చెప్పారు.

రెండు నగరాలు ఒకేలా..

సియోల్, హైదరాబాద్ నమూనాలు ఒకేలా ఉంటాయని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ అన్నారు. సియోల్‌లో సుమారు 10వేల మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి ఆ నగరంలోని నాలుగు వైపులకు తరలిస్తున్నారని తెలిపారు. హైదరాబాదలో ఉత్పన్నమవుతున్న దాదాపు 8వేల టన్నుల చెత్తను సేకరించి ఒకే వైపునకు తరలిస్తున్నట్లు చెప్పారు.

సీఎం ఆదేశాల మేరకు నగరం చుట్టూ నాలుగు ప్రదేశాలను గుర్తించామన్నారు. నగరంలోని చెత్తను నాలుగు వైపులకు పంపడం ద్వారా రవాణా ఖర్చు తగ్గుతుందన్నారు. మరో పదేండ్లలో పూర్తిగా భూగర్భంలో అతిపెద్ద ప్లాంట్‌ను నిర్మించేందుకు సియోల్ నగర పాలక సంస్థ ప్రయత్నాలు చేస్తోందని వారు తెలిపారు.

సీఎం సలహాదారు వేంనరేందర్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, మల్‌రెడ్డి రంగారెడ్డి, జీహెచ్‌ఎంసీ, మూసీ రివర్‌ఫ్రంట్ అధికారులు