calender_icon.png 7 February, 2025 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ ప్రక్షాళనతో పేదల జీవితాల్లో మార్పు

07-02-2025 02:08:57 AM

  1. వారికి అన్నివిధాలుగా భరోసా ఇస్తాం
  2. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 6: మూసీ నది ప్రక్షాళనతో పేదల జీవితాలు పూర్తిగా మారిపోతాయని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్  పేర్కొన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులను స్పీకర్ గడ్డం ప్రసా  మండలి చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్‌తో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు ప్రారం  హిమాయత్‌సాగర్ వద్ద ఫిల్డర్‌బెడ్‌తో పాటు బండ్లగూడ నగరపాలక సంస్థ భవనాన్ని ప్రారంభించారు.

అనంతరం ఆ  మాట్లాడుతూ.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూసీ బాధితులను ఇబ్బంది పెట్టే  ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నాయని తెలియజేశారు. మూసీలో ఇళ్లు కోల్పోతున్న వారికి విశ్వాసం, భరోసా కల్పించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు.

పట్టణ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో గోదావరి నదీ జలాలు నగరానికి తీసుకొచ్చి సరఫరా చేస్తున్నట్లు వివరించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత జంట నగరాలకు మూసీ నదిని జీవనదిని చేయడానికి ఏడు టీఎంసీల నీటిని తీసుకొచ్చి శుద్ధి చేస్తామని స్పష్టం చేశారు. బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలో గతంలో మిగిలిపోయిన రూ.215 కోట్ల పనులను పూర్తి చేశామని స్పష్టం చేశారు. 

మూడు రిజర్వాయర్లు ప్రారంభం

ఓఆర్‌ఆర్ వరకు తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు కొత్తగా ఏర్పడిన కాలనీలకు సైతం తాగునీరు సరఫరా చేసేందుకు జలమండలి ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మూడు రిజర్వాయర్లను నిర్మించారు. వాటిని మంత్రి శ్రీధర్‌బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, విప్ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ ప్రారంభించారు.

హిమాయత్‌సాగర్, బుద్వేల్, గండిపేటలో నిర్మించిన 11 ఎమ్మెల్డీల మూడు ప్రెషర్ ఫిల్టర్లను ప్రారంభించారు. కార్యక్రమంలో రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి, తెలంగాణ అర్బన్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ కమిషనర్ శరత్‌చంద్ర, మాజీ మేయర్లు లతాప్రేమ్‌గౌడ్, మహేందర్‌గౌడ్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్లు సుదర్శన్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.