22-02-2025 01:15:26 AM
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం ముష్టిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న సాయి, తరుణ్ అనే ఇద్దరు విద్యార్థులు తయారు చేసిన నీటిపై తెలియాడే పడవ జాతీయ స్థాయిలో ఉత్తమ బహుమతిని అందుకుంది.
20 లీటర్ల వాటర్ బాటిళ్లు, రెండు కుర్చీలు, సాధారణ కర్రల సహాయంతో వరద బాధితులను ప్రాణాలతో రక్షించడం కొరకు ఓ పడవను తయారు చేసి అందరిచే ప్రశంసలు అందుకున్నారు. ఈ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపిక కావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.