కరీంనగర్,(విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పర్వానికి ఇప్పటి నుంచే రంగం సిద్ధం అవుతోంది. దానికి అనుగుణంగా పోటీలో ఉన్న అభ్యర్థులంతా సన్నద్ధం అవుతున్నారు. ఇందులో ట్రస్మా పాత్ర అత్యంత కీలకమైనది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల నియోజకవర్గం నుండి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న లక్ష విద్యాసంస్థల అధినేత డాక్టర్ ముస్తాఖ్ అలీ ఖాన్ 2019 నుండి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ట్రస్మాలో తన ప్రయాణం మొదలు నుంచి నేటి వరకు సంఘం తరఫున ఎన్నో అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని తన అనుభవాన్ని పెంచుకుంటూనే తోటి సభ్యులకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ విద్యారంగాన్ని చైతన్యం చేస్తూనే ఉన్నాడు. ప్రైవేటు రంగంలోని ఉపాధ్యాయులందరికీ తరచుగా బోధన అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యారంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తున్నారు. ట్రస్మా తరఫున చైతన్యంగా ఉన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ముస్తాఖ్ అలీని చెప్పవచ్చు. ఈ తరుణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ముస్తాఖ్ అలీ ట్రస్మా అధ్యక్షుడు సాదుల మధుసూదన్ ని ప్రత్యేకంగా కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సలహాలు సూచనలు తీసుకోవడంతో పాటుగా, మద్దతును కూడా కోరారు. దీంతో ట్రస్మా మద్దతు ముస్తాక్ అలీ కేనా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది.