* -ఆర్బిఐ నిబంధనలు పాటిస్తున్నామని ప్లాట్లు, ఇండ్లు మాడీగేజ్ చేసుకుంటూ రుణాలు అందిస్తున్న ఫైనాన్స్ కంపెనీలు
* -నూటికి రూ.1 మిత్తే అంటూ ఆకర్షిస్తున్న ఫైనాన్స్ కంపెనీలు
* -తీసుకున్నాక లబోదిబో మంటూ ఆవేదనచేస్తున్న లబ్ధిదారులు
*-బ్యాంకుల్లో అవసరం మేరకు రుణాలు తీసుకోవాలి: లీడ్ బ్యాంకు మేనేజర్
మహబూబ్ నగర్, జనవరి 19 (విజయ క్రాంతి) : ఒకప్పుడు రుణాలు అంటే కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేవి. పట్టణంలోని నివాసం ఉంటున్న వారికి, సొంతింటివారికి వారి ఆర్థిక పరిస్థి తులను పరిగణలోకి తీసుకుంటూ బ్యాంకు లో వారికి రుణాలు ఇచ్చేవి. ఇప్పుడు ఆ పరి స్థితి కనిపించడం లేదు.. మా కంపెనీ ఎన్నో ఏళ్ల నుంచి ఉంది... కేవలం నూటికి ఒక్క రూపాయి మాత్రమే మిత్తి... మీరు అను కుంటే కేవలం వారం రోజుల్లోనే మీ ఖాతా లో రుణ డబ్బులు పడతాయి... మీరు చేయ వలసిందిగా ఒకటే... రిజిస్ట్రేషన్ కార్యాల యానికి వచ్చి మీ ఇంటి పత్రాలు, ప్లాట్ పత్రాలు తీసుకువచ్చి మాదిగేజి చేస్తే చాలు... ఇక మీరు స్వేచ్ఛగా ప్రతినెల కొంతమంది కట్టుకుంటే సరిపోతుందంటూ పుట్టగొడు గుల పుట్టుకొస్తున్నాయి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు.
ముందుగా పసిగట్టని లబ్ధిదా రులు రూపాయి మిత్తే కదా బయట ఎక్కడ దొరుకుతుంది? అంటూ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులను నమ్మి రుణాలు అర్ధిస్తుండ్రు. మణాలు తీసుకున్న తర్వాత రూపాయి మిర్చి నుంచి దాదాపుగా మూడు రూపాయ ల వరకు వడ్డీ పడుతుంది.
అప్పుడు లెక్కలు చూసుకుంటే ఇంత మిత్తి ఎలా పడుతుందని ప్రశ్నిస్తే డొంక తిరుగుడు సమాధానాలు చెబుతూ ప్రతినిధులు రుణ గ్రహీతలకు దూ రం దూరంగా ఉంటూ మోసం చేస్తుండ్రు. ఫైనాన్స్ కంపెనీల పై నియంత్రణ అంతంత మాత్రమే ఉండడంతో వారు చేసిందే చట్టం చెప్పింది వాగ్దానం అనే విధిగా రుణ ప్రక్రి యలు జరుగుతున్నాయి.
చెప్పేదొకటి చేసేదొకటి
రుణాలు అందించే సమయంలో రుణ గ్రహీతల ఇంటికి పలుమార్లు తిరుగుతూ ప్రైవేట్ కంపెనీలు వారికి గాలం వేసే పనిలో నిమగ్నమై పనిచేస్తున్నాయి. మీరు బ్యాంకు కు వెళ్లి రుణాలు తీసుకోవాలనుకుంటే ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ చూపించాల్సి ఉం టుందని మీ దగ్గర అవి లేవని, మూడు నుం చి నాలుగు సంవత్సరాల వరకు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ చూపించి ఆదాయం సక్రమం గా చూపిస్తానే బ్యాంకులో రుణాలు ఇస్తా యని మేము అలాంటిది ఏమీ లేకుండానే కేవలం మీ ఇంట్లోని మాడిగేజీ చేసుకొని రుణం మీరు అడిగినంత ఇస్తామని నమ్మి స్తుండ్రు.
డబ్బు అవసరం ఉన్న గ్రామీణ ప్రాంత వాసులు అటువైపు చూసి ఇండ్లను మాడిగేట్ చేసి రుణాలు పొందుతున్నారు. తీసుకున్నా రుణానికి నూటికి దాదాపుగా మూడు రూపాయల వ్యక్తి పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకుం టుండ్రు. ఈ కంపెనీలపై నిఘా ఉంచ వలసిన అధికారులు మాత్రం అటువైపు చూడడమే మానేశారని రుణ గ్రహీతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మోసపోకండి... ఆలోచించండి
రుణం ఎంత అడిగితే అంతా ఫైనాన్స్ కంపెనీలు ఇస్తున్నాయని తీసుకుంటే పొర పాటు పడినట్లే అవుతుంది. తీసుకున్న రుణానికి చెల్లించాల్సిన డబ్బులకి ముందు గా ఒకసారి పూర్తిస్థాయిలో సమగ్రంగా ఆలోచన చేయండి. తీసుకున్న తర్వాత మోస పోయాం ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తే తిరిగి ఆ లోన్ చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కోవడం తప్పదు. రుణాలు పొందే టప్పుడు బ్యాంకులో నుండి సంప్రదించి అవసరమైన డబ్బులను తీసుకొని తిరిగి చెల్లించేందుకు ముందుకు సాగితే రుణ గ్రహీతలకు ఎంతో మేలు జరుగుతుంది.
రుణాలు బ్యాంకుల్లోనే తీసుకోవాలి
రుణాలు ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. ఎవరు ఇస్తున్నారు అంటే వారిని సంప్రదించి అత్యధిక వడ్డీకి అస్స లు రుణం తీసుకోకూడదు. ఇండ్లు, ప్లాట్లు మాడిగేజీలు చేసిన తర్వాత అధిక డబ్బులు ఇస్తున్నారని తీసుకుంటే మీరు కట్టవలసింది కూడా అధికంగానే ఉంటుందని గుర్తించాలి. తక్కువ డబ్బులు ఇచ్చిన బ్యాంకులు నియమ నిబంధనలు పాటించి రుణాలు అందిస్తాయి. బ్యాంకు లను సంప్రదించి అవసరమైన పత్రాల ను అందించి రుణాలు పొందాలి. నిబం ధనలు పాటించని ఫైనాన్స్ కంపెనీల పై అవసరమైన చర్యలు తీసుకుంటాం.
-భాస్కర్, లీడ్ బ్యాంక్ మేనేజర్, మహబూబ్ నగర్ జిల్లా