calender_icon.png 3 April, 2025 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముషీరాబాద్ కుమ్మరి సంఘం చైర్మన్ రాములు మృతి

29-03-2025 12:14:49 AM

నివాళులర్పించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, మార్చి 28: (విజయక్రాంతి) : ముషీరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, కుమ్మరి సంఘం చైర్మన్ ఎ. రాములు (80) శుక్రవారం మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విష యం తెలుసుకున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముషీరాబాద్ లోని తన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు.

వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కుమ్మరి కులస్తుల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయనతో పాటు బీఆర్‌ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్, రాష్ట్ర  యువనాయకుడు ముఠా జై సింహ, సీనియర్ నాయకుడు పూస గోరఖ్నాథ్ డివిజన్ అధ్యక్షుడు కొండ శ్రీధర్ రెడ్డి, ముషీరాబాద్ డివిజన్  ప్రధాన కార్యదర్శి ఆకుల అరుణ్ కుమార్, కుమ్మర సంఘం అధ్యక్షుడు బండారి గోపాల్, ఉపాధ్యక్షుడు టిల్లు, కార్యనిర్వాహక కార్యదర్శి ప్రేమ్ కుమార్ లు నివాళులర్పించారు.