01-03-2025 09:47:10 PM
వివిధ శాఖల అధికారుల సమావేశంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్,(విజయక్రాంతి): పవిత్ర రంజాన్ మాసంలో మసీదుల వద్ద ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రభుత్వ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే ముఠా గోపాల్ జలమండలి, జిహెచ్ఎంసి, విద్యుత్ శాఖ, ముషీరాబాద్ పోలీసులు, చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఎమ్మెల్యే భోలక్పూర్ డివిజన్లో ప్రసిద్ధిగాంచిన బడి మజీద్, బిలాల్ మసీద్ తదితర వాటిని సందర్శించి మసీదు పెద్దలతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలో నెల రోజులపాటు ముస్లింలు ఉపవాస దీక్షలో ఉండి సామూహిక ప్రార్థన చేసేందుకు మసీదులకు వేల సంఖ్యలో హాజరుకానుండడంతో మసీదుల వద్ద వెంటనే కనీస సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
నిరంతర విద్యుత్ సరఫరా, మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ సమస్య తలెత్తకుండా జిహెచ్ఎంసి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు సకాలంలో స్పందించి పనులు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జలమండలి డిజిఎం కార్తీక్ రెడ్డి, మేనేజర్ కృష్ణమోహన్, జిహెచ్ఎంసి డి ఈ సన్నీ , శానిటైజర్ సూపర్వైజర్ గోవర్ధన్, చిక్కడపల్లి ట్రాఫిక్ ఎస్సై యాదగిరి, ముషీరాబాద్ ఎస్సై ప్రసాద్ రెడ్డి , స్ట్రీట్ లైట్ సూపర్వైజర్ బాలు నాయక్, గొల్లపూడి డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు వై .శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర నాయకులు షరీఫ్ , మసీద్ సభ్యులు నజీర్ భాయ్, దిల్బర్ హుస్సేన్, రహీం , డివిజన్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అలీ, రెహమత్ అలీ, నాయకులు శంకర్ గౌడ్ మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, హాజీ పాష,దస్తగిరి, ప్రవీణ్, కేం సాయి, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.