calender_icon.png 28 September, 2024 | 4:57 PM

రోడ్డు ప్రమాదంలో యంగ్ క్రికెటర్‌కు గాయాలు.. కీలక మ్యాచ్ కు దూరం

28-09-2024 02:26:39 PM

లక్నో: భారత ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్(19) ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో రాబోయే ఇరానీ కప్‌కు దూరమయ్యాడు. తన తండ్రి నౌషాద్ ఖాన్‌తో కలిసి అజంగఢ్ నుండి లక్నోకు ప్రయాణిస్తుండగా కారు ప్రమాదం జరిగింది. గత ఏడాదిగా దేశవాళీ క్రికెట్‌లో తన క్రికెట్ కెరీర్‌లో అడుగులు వేస్తున్న ముషీర్‌కు ఈ గాయం పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

యంగ్ బ్యాటర్ ముషీర్ ఖాన్ ఇటీవల దులీప్ ట్రోఫీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇండియా-సీ జట్టు తరుపున బరిలోకి దిగిన అతను ఇండియా-ఏపై భారీ శతకం(181) బాదాడు. అతని గాయం కారణంగా క్రికెట్ కు దూరం కానున్నాడు. కొన్ని మీడియా నివేదికలు ముషీర్‌కు ఫ్రాక్చర్ అయ్యాయని పేర్కొంటుండగా, మరికొందరు అతని మెడకు బలమైన గాయం తగిలిందని పేర్కొన్నారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం అస్పష్టంగా ఉన్నప్పటికీ, ముషీర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై నాలుగైదు సార్లు పల్టీలు కొట్టిందని పోలీసులు వెల్లడించారు. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో అక్టోబరు 1 నుంచి 5 వరకు జరగనున్న ఇరానీ కప్ మ్యాచ్ కోసం రెస్ట్ ఆఫ్ ఇండియాతో రైట్ హ్యాండ్ బ్యాటర్ ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ 11 నుంచి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌లకు ముషీర్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ముషీర్ దేశవాళీ క్రికెట్ లెక్కల విషయానికి వస్తే, అతను తొమ్మిది మ్యాచ్‌లలో 51.14 సగటుతో 716 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక ఆఫ్ సెంచరీ కూడా ఉన్నాయి. ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్ చేస్తూ, అతను 26.87 సగటుతో ఎనిమిది వికెట్లు కూడా పడగొట్టాడు. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌లో ముషీర్ ఇటీవలి ఆకట్టుకునే ప్రదర్శనలలో ఇండియా Aకి వ్యతిరేకంగా 181 పరుగుల మ్యాచ్ విన్నింగ్ నాక్ కూడా అతని ఖాతాలో ఉంది. అంతకుముందు, ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ 2024 ప్రచారంలో ముషీర్ పేరు ప్రముఖంగా తెరమీదకు వచ్చింది. ఏడు మ్యాచ్‌లలో 360 పరుగులతో భారత్‌ను ఫైనల్స్‌కు చేరుకోవడంలో సహాయం చేశాడు. అతను టోర్నమెంట్‌లో రెండవ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ప్రపంచ కప్‌ను ముగించాడు.