calender_icon.png 8 November, 2024 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముర్ముకు ఫిజీ అత్యున్నత పురస్కారం

07-08-2024 02:49:47 AM

దేశ అధ్యక్షడు కటోనివేర్ చేతుల మీదుగా ప్రదానం

ఫిజీకి భారత్ అండగా ఉంటుందన్న రాష్ట్రపతి

న్యూఢిల్లీ, ఆగస్టు 6: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ప్రస్తుతం ఫిజీ దేశ పర్యటన లో ఉన్న ముర్ముకు సోమవారం ఆ దేశ అధ్యక్షుడు ‘కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’ అవార్డును అందజేశారు.

ఈ సందర్భంగా ఫిజీ పార్ల మెంట్‌ను ఉద్దేశించి ముర్ము మాట్లాడుతూ.. ఫిజీని బలమైన, సంపన్న మైన దేశంగా మార్చేందుకు భారత దేశం ఆర్థికంగా, వాణిజ్యపరంగా అన్నివిధాలుగా అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పదేళ్ల క్రితం ఫిజీ పార్లమెంట్లో ప్రధాని మోదీ మాట్లాడిన మాటలను ముర్ము గుర్తుచేశారు. కాగా ఫిజీలో పర్యటించడం రాష్ట్రపతికి ఇదే మొదటిసారి.