16-02-2025 10:34:06 AM
న్యూఢిల్లీ: దిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. యాత్రికుల మృతిపట్ల ద్రౌపతి ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ప్రార్థించారు. దిల్లీ తొక్కిసలాట ఘటనపై ఉప రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాలకు జగదీప్ ధన్ ఖడ్(Vice President Jagdeep Dhan Khad) ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని జగదీప్ ధన్ ఖడ్ ఆకాంక్షించారు.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్(New Delhi Railway Station Stampede)లో రాత్రిపూట జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 18కి పెరిగిందని అధికారులు ఆదివారం తెలిపారు, సంఘటనపై నగర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే స్టేషన్(Railway Station)లో శనివారం అర్థరాత్రి జరిగిన తొక్కిసలాటలో 30 మందికిపైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 14- 15లో మహా కుంభ్(Kumbh Mela) జరుగుతున్న ప్రయాగ్‌రాజ్ కోసం రైళ్లలో ఎక్కడానికి వేచి ఉన్న ప్రయాణీకుల రద్దీతో తొక్కిసలాట జరిగింది. సెంట్రల్ ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాష్ ఆసుపత్రిలో 15 మంది మరణించారని ఢిల్లీ తాత్కాలిక ముఖ్యమంత్రి అతిషి(Atishi Marlena) అంతకుముందు విలేకరులతో చెప్పారు.