calender_icon.png 24 January, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధురాలి హత్య

07-12-2024 03:03:26 AM

బెల్లంపల్లి, డిసెంబర్ 6 (విజయక్రాంతి): వృద్ధురాలిని హత్య చేసిన ఘటన బెల్లంపల్లి మండలం మన్నెగూడెంలో చోటుచేసుకున్నది. స్థాని కుల కథనం మేరకు.. గూడెంలోని కమ్మరి మహేశ్ తన భార్యతో తర చూ గొడవపడేవాడు. గురువారం రాత్రి మద్యం మత్తులో మహేశ్ తన భార్య మౌనిక, అత్త పద్మతో గురువారం రాత్రి గొడవపడ్డాడు. ఈక్ర మంలో వారి దగ్గరి బంధువులైన బుచ్చక్క, ఎండల కమల(౬౫) గొడవను ఆపేందుకు వెళ్లారు. దీంతో కోపోద్రిక్తుడైన మహేశ్ తన అత్తకి సపోర్ట్ చేస్తారా అంటూ పద్మతోపా టు బుచ్చక్కను పొగగొట్టంతో చితకబాదాడు.

వరుసకు అవ్వ అయిన కమల (65)ను గూన పెంకుతో తల పై బాది కిందపడగానే నీళ్ల బిందెను ఎత్తేశాడు. కమల ఊపిరాడక కుప్పకూలడంతో స్థానికులు ఆమెను బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెం దింది. గాయపడిన బుచ్చక్క, పద్మ చికిత్స పొందుతున్నారు. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అ దుపులోకి తీసుకున్నట్టు తాళ్లగురిజాల ఎస్సై రమేశ్ తెలిపారు.