కామారెడ్డి, నవంబర్ 12 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా బాన్సువా డలో ఓ వృద్ధుడిని దారుణంగా హ త్య చేశారు. పోలీసుల కథనం ప్రకా రం.. బాన్సువాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రకాశ్ ఇంటి వద్ద సాలె వెంకటి (65) వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. అతడు పని చేస్తున్న ఇంటికి దగ్గరలోని సరస్వతి ఆల యం శివారులోని ఓ ఇంట్లో వెంకటిని సోమవారం రాత్రి గుర్తు తెలి యని వ్యక్తులు హతమార్చారు.
సం ఘటన స్థలంలో పేకాట ముక్కలు ఉండటంతో పేకాడినవారే అతడిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల ఫి ర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. కాగా ఒకేరాత్రి బాన్సువాడలో రెండు హత్యలు జరగడం సంచలనం రేపుతున్నది. మహిళ హత్యతోపాటు వృద్ధుడి హత్య జరగడంతో పట్టణం ఉలిక్కిపడింది.