calender_icon.png 23 February, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్తికోసం వృద్ధుడి హత్య

19-02-2025 12:09:58 AM

కాల్చి చంపిన దుండగులు

కామారెడ్డి, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బాణాపూర్ అడవి ప్రాంతంలో పోచయ్య (70) అనే వ్యక్తిని సోమవారం రాత్రి హత్య చేసి దహనం చేశారు. ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోచయ్య స్వగ్రామం పిట్లం మండలంలోని  బొల్లకుపల్లి గ్రామంగా నిర్ధారించారు.

పిట్లం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోచయ్యను హత్య చేసింది బంధువులేనని  పోలీసులు భావిస్తున్నారు. ఆస్తికోసం  హత్య చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

హత్యకు పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారిచ్చిన సమాచారంతోనే హత్య జరిగిన ప్రాంతంలో ఆనవాళ్లను సేకరించినట్లు సమాచారం. పిట్లం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.