calender_icon.png 2 April, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముప్పిరితోటలో యువకుడి హత్య

29-03-2025 01:17:57 AM

తన కూతురును ప్రేమించాడని చంపిన తండ్రి?

పెద్దపల్లి, మార్చి 28 (విజయక్రాంతి): ప్రేమ వ్యవహారంతోనే ఎలిగేడు మండలంలోని ముప్పిరితోటలో యువకుడు హత్యకు గురయ్యాడని సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ముప్పరితోట గ్రామానికి చెందిన పూరెల్ల సాయి కుమార్(20), అదే గ్రామానికి చెందిన యు వతి గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమ లో ఉన్నారు. కులాలు వేరు కావడంతో యు వతి తల్లితండ్రులు ఇద్దరినీ పలుమార్లు బెదిరించారు.

అయినా కూడా వారి ప్రేమ వ్యవ హారం అలాగే కొనసాగుతుంది. దీంతో యు వతి తండ్రి ముత్యం సదయ్య తన కూతుర్ని ప్రేమిస్తున్న పూరెల్ల సాయికుమార్‌ని హతమార్చాలని పథకం వేశాడు. ఈ నెల 27న సాయికుమార్ తన పుట్టినరోజు సందర్భం గా స్నేహితులతో కలిసి మద్యం సేవించేందుకు గ్రామంలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్దకు వెళ్లాడు.

ఇది తె లుసుకున్న సదయ్య.. ద్విచక్ర వాహనంపై వెళ్లి సాయికుమార్‌పై తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో దాడి చేశా డు. పారిపోతున్న సాయికుమార్‌ను వెంబడించి గొడ్డలితో విచక్షణా రహితంగా నరక డంతో ఘటన స్థలంలోనే సాయికుమార్ మృతి చెందాడు.

సాయి మృతి చెందాడని నిర్ధారించుకున్నాక నిందితుడు సదయ్య, అతడి భార్య సమత అక్కడి నుంచి పారిపోయారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని సీఐ తెలిపారు.