calender_icon.png 15 January, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొంతు గోసి కాలువపై కారు డ్రైవర్ హత్య

11-09-2024 10:38:49 AM

తుంగతుర్తి,విజయక్రాంతి: గొంతు కోసి ఎస్సార్ ఎస్పి మెయిన్ కాల్వ పక్కన వ్యక్తి మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని డి.కొత్తపల్లి గ్రామ శివారులో సూర్యాపేట- జనగాం జాతీయ రహదారి365 పై  మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు పోలీసుల  తెలిపిన వివరాలు ప్రకారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీకి చెందిన వనగండ్ల కిరణ్ కుమార్ (27) కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. పదునైన ఆయుధంతో గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి కాలువ పక్కన పడేశారు. స్థానికులు గమనించి పోలీసు సమాచారం ఇవ్వడంతో అక్కడ చేరుకున్న, సూర్యాపేట డిఎస్పి రవికుమార్, నాగారం సర్కిల్ సిఐ రఘువీర్ రెడ్డిలు ఎస్ఐ ఐలయ్య చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. క్లూస్ టీమ్, డాగ్స్  బృందాలతో  ఆధారాలు సేకరించి నిందితులను పట్టుకుంటామని తెలిపారు.