calender_icon.png 11 March, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్తి కోసం హత్య?

20-01-2025 12:00:00 AM

కామారెడ్డి జిల్లా అన్నారంలో ఘటన

కామారెడ్డి, జనవరి 19 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి తన ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. రామారెడ్డి ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన పొక్కిలి జంపాలరవి(48), సంగీత దంపతులు. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

సంగీత తన ఇద్దరు పిల్లలతో తల్లిగారింటికి వెళ్లగా.. శనివారం రాత్రి జంపాల రవిని హత్య చేసినట్టుగా తెలుస్తున్నది. కాగా జంపాల రవి గత కొద్ది రోజుల క్రితం తన అన్నను చంపాలనే ఉద్దేశంతో రాత్రింబవళ్లు వెంబడించాడని గ్రామస్థులు తెలిపారు. ఆస్తుల పంపకాలు జరిగినప్పటికీ రెండు కుటుం బాల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ గొడవలే హత్యకు దారి తీసినట్టుగా తెలుస్తున్నది.