calender_icon.png 20 April, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్యపై హత్యాయత్నం.. ఐదేళ్లు శిక్ష

12-04-2025 12:05:06 AM

మేడ్చల్, ఏప్రిల్ 11(విజయక్రాంతి) భార్య పై హత్యాయత్నం చేసిన తహసీల్దార్‌కు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ పిఎస్ జె కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. నాంపల్లిలోని సీసీఎల్‌ఏలో తహసీల్దార్‌గా పని చేస్తున్న రామహరి ప్రసాద్ మేడ్చల్ జిల్లాలోని కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలో భవాని నగర్ కాలనీలో నివాసముంటు న్నాడు. భార్యను తరచు వేధిస్తూ భౌతిక దాడి చేసి అత్యాయత్నం చేసినట్టు కీసర పోలీస్ స్టేషన్లో నాలుగేళ్ల క్రితం కేసు నమోదు అయింది. ఈ కేసులో న్యాయమూర్తి నిందితుడిని దోషిగా నిర్ధారించి, కఠిన కారాగర శిక్షతో పాటు, పదివేల రూపాయల జరిమానా విధించారు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూ టర్ రవికుమార్ వాదనలు వినిపించారు.