26-03-2025 06:10:24 PM
సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు బుధవారం తీర్పు వెలువరించారు. 2022, ఆగస్టు 21న జైనథ్ మండలం రాంపూర్ కు చెందిన కొడిమెల ప్రభాకర్ ను పాత కక్షల కారణంగా కుట్ల రమేష్ కత్తితో పొడిచి, కొట్టి చంపారు. జైనథ్ అప్పటి ఎస్సై పెర్సిస్, సీఐ నరేష్ కుమార్ లు కేసు నమోదు చేశారు. కేసులో కోర్టు లైజర్ అధికారి గంగా సింగ్, కోర్టు డ్యూటీ అధికారి ఎం.ఏ జమీర్ లు 18 మంది సాక్షులను ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మేకల మధుకర్ విచారించి నిందితునిపై నేరం రుజువు చేయగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు నిందితుని పై విదంగా శిక్ష విధించారు. ఈ కేసులో నేరస్తునికి శిక్ష పడడంలో కృషి చేసిన కోర్టు డ్యూటీ అధికారి, కోర్టులైజర్ అధికారి, పి.పి లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.