‘క్రాష్ కోర్స్’, ‘ముంబైకర్’, ‘థగ్స్’ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో తన నటనతో మెప్పించిన యువ కథానాయకుడు హ్రిదు హరూన్, విలక్షణ నటుడు సూరజ్ వెంజారముడు ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న రియల్ రా యాక్షన్ చిత్రం ‘ముర’. దీన్ని ‘కప్పేల’ మూవీ ఫేమ్ దర్శకుడు మహ్మద్ ముస్తఫా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. సాఫీగా సాగిపోతున్న నలుగురు టీనేజ్ కుర్రాళ్ల జీవితం.. ఓ వ్యక్తి కారణంగా అనుకోని మలుపులు తీసుకుంటుంది. దీంతో వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వాటిని వారు ఎలా అధిగమించారనేదే సినిమా కథాంశం. కేరళ, త్రివేండ్రంలో జరిగిన నిజ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
మలయాళంలో రూపొందిన ఈ చిత్రంలో మాలా పార్వతి, కని కుస్రుతి, కన్నన్ నాయర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి బ్యానర్: హెచ్‌ఆర్ పిక్చర్స్; రచన: సురేశ్‌బాబు; సినిమాటోగ్రఫీ: ఫాజిల్ నజీర్; సంగీతం: క్రిస్టి జోబి; నిర్మాత: రియా శిబు, దర్శకత్వం: మహ్మద్ ముస్తఫా.