calender_icon.png 20 November, 2024 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్ట్ షాపులపై మరోసారి ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి సీరియస్

05-08-2024 06:17:02 PM

హైదరాబాద్: బెల్ట్ షాపులపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మరోసారి సీరియస్ అయ్యారు. కొంతమంది మహిళాలు ఎమ్మెల్యేను కలిసి మునుగోడు నియోజక వర్గంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. దీంతో రాజ్ గోపాల్ రెడ్డి స్పందించి ఎవరి ఇంట్లో అయితే మద్యం అమ్ముతున్నారో తెలిస్తే ధైర్యంగా పోలీసులకు ఫోన్ చేయాలని మహిళలకు సూచించారు. ఇకపై ఎవరైన మద్యం విక్రయిస్తున్నట్లు కనిపిస్తే పోలీసులను సంప్రదించండాని పోలీసు ఉన్నతాధికారులను పిలిచి బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేశారు. 

బెల్ట్ షాపుల్లో ఎక్కడ మద్యం అమ్మిన పోలీసు సిబ్బందికి తెలియజేయాలంటూ, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గరుండి పోలీసుల నెంబర్లను మహిళలకు ఇచ్చారు. గతంలో ఆయన మునుగోడు మండలంలోని 26 గ్రామాల ముఖ్య నేతలతో బెల్ట్ షాపులు మూసివేత, గ్రామాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. బెల్ట్ షాపుల విషయంలో చాలా సీరియస్ గా ఉంటామని మద్యానికి బానిసలైన ఎన్నో కుటుంబాలు నాశమవుతున్నాయని అన్నారు.