05-04-2025 01:41:42 PM
విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన గుత్తా నాగేశ్వరరావు..
విజయక్రాంతి, వైరా: మున్నూరు కాపు ఆత్మ గౌరవ మహా ధర్నా సేన ఆధ్వర్యంలో ఏప్రిల్ 13వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో మున్నూరు కాపుల రణభేరి కార్యక్రమం కు సంబందించి న పోస్టర్ ను పరిధిలోని గన్నవరం గ్రామంలో వైరా నియోజకవర్గ కన్వీనర్ గుత్తా నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపుల రణభేరి కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో కాపులు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కనిశెట్టి సతీష్, కోరే రాజేష్, రంగిశెట్టి శ్రీను, రంగశెట్టి రవి, సిహెచ్ కాంతారావు,కడం హనుమంతరావు, మిర్యాల సాయి మేడి అనిల్ సామాజిక వర్గ ప్రజలు పాల్గొన్నారు