21-04-2025 12:53:43 AM
పేదింటి ఆడబిడ్డకు పెళ్లి కానుకగా పుస్తె మెట్టెలు, బట్టలు
ఇద్దరికి బహూకరించిన పటాన్ చెరు సంఘం
ఈ పథకం నిరంతరం కొనసాగుతుందని స్పష్టీకరణ
పటాన్ చెరు, ఏప్రిల్ 20 : పటాన్ చెరు మున్నూరు కాపు సంఘం కొత్తగా ప్రారంభించిన ఎంకే మహాలక్ష్మి పథకం ఆచరణలోకి వచ్చింది. సంఘం నాయకులు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని ఆచరణలోకి తెచ్చినట్లు ము న్నూరు కాపు సంఘం నేతలు ప్రకటించారు. పటాన్ చెరు ము న్నూరు కాపు సంఘంలో సభ్యత్వం కలిగిన కుటుంబానికి పేదింటి ఆడబిడ్డ వివాహానికి పుస్తె ,మెట్టెల తో పాటు చీర జాకెట్ లను అందజేశారు. ఆదివారం స్థానిక మున్నూరు కాపు సంఘం భవనంలో గోనెమ్మ బస్తి వాసులు అనసూయ కూతురు నవనీతకు అలాగే నర్రబస్తి వాసులు మహేష్ కూతు రు మౌనిక లకు పుస్తె మెట్టెలు చీర జాకెట్ లు అందించారు..
ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ ఎంకే మహాలక్ష్మి పథకం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పటాన్ చెరు మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు నాయికోటి భోజయ్య , ప్రధాన కార్యదర్శి ఉప్పరి రమేష్ కుమార్, గౌరవ అధ్యక్షుడు బుచ్చయ్య , ముఖ్య సలహాదారుడు నర్ర బిక్షపతి , గౌరవ సలహాదారులు కాసాల శంకర్ , నాయికోటి జీతయ్య , బాయికాడి పెంటయ్య, యంజాల యా దయ్య ఉపాధ్యక్షులు నర్ర రామారావు, మైలారం అశోక్, యం జాల మల్లేష్, కార్యదర్శులు కొడకంచి భార్గవ్ , మేకల జగదీష్ , సహాయ కోశాధికారి యంజాల రాజేష్, సంయుక్త కార్య దర్శి నాయికోటి సత్యం, కార్యవర్గ సభ్యులు పాతూరి నర్సింగ్ రావు, యంజాల సాయి, ఉప్పరి మల్లేష్ పాల్గొన్నారు.