calender_icon.png 13 April, 2025 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్నూరు కాపు సంఘం పాలక మండలి ప్రమాణస్వీకారం

08-04-2025 12:00:00 AM

అధ్యక్షుడిగా నాయికోటి భోజయ్య ప్రధాన కార్యదర్శిగా ఉప్పరి రమేష్

అభినందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

పటాన్ చెరు, ఏప్రిల్ 7 : పటాన్ చెరు మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం మున్నూరు కాపు సంఘ భవనంలో సోమవారం జరిగింది.  నూతన అధ్యక్షుడిగా నాయికోటి భోజయ్య ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులందరూ తమ ప్రమాణ స్వీకారాలను పూర్తి చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నాయికోటి భోజయ్య మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన విధంగా రెండు కొత్త హామీలకు శ్రీకారం చుట్టారు.

కాగా నూతన కమిటీలో గౌరవ అధ్యక్షులుగా బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శిగా ఉప్పరి రమేష్ కుమార్, ముఖ్య సలహాదారుడిగా నర్ర బిక్షపతి, గౌరవ సలహాదారులుగా కాసాల శంకర్, బాయికాడి పెంటయ్య, కోశాధికారిగా గాదె మహేందర్, సహాయ కోశాధికారిగా మేకల శివకుమార్ ఉపాధ్యక్షులుగా నాయికోటి జీతయ్య, కాసాల యాదయ్య ,నర్ర రామారావు ,మైలారం అశోక్ , గాదే సుధాకర్, యంజాల మల్లేష్ కార్యదర్శులుగా కొడకంచి భార్గవ్, మేకల జగదీష్, సంయుక్త కార్యదర్శులుగా గాదె శ్రీనివాస్, సంజీవ్, నాయి కోటి సత్యం, నర్రా సత్యనారాయణ, ఉప్పరి అభిషేక్ కుమార్, ప్రచార కార్యదర్శులుగా యంజాల రాజేష్, మున్నూరు విక్రం, మల్లం పవన్, నాయికోటి శ్రీకాంత్ లతోపాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు

అభినందించిన ఎమ్మెల్యే 

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మున్నూరు కాపు సంఘం కొత్త పాలక మండలిని అభినందించారు. సంఘం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాయికాడి విజయ్, ఎట్టయ్య, టప్పా కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొల్కూరి నరసింహారెడ్డి, ఉప్పరి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.