03-03-2025 01:12:45 AM
కోట శివశంకర్
కొత్తగూడెం, మార్చి 2 (విజయ క్రాంతి ): కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని మేకల వద శాల సమస్యల నిలయంగా మారిందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పిఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోటా శివశంకర్ అన్నారు . ఆదివారం ఆయన విడుదల చేస్తున్న ప్రకటనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇళ్ల సమీపంలో మేకలు కోయకూడదని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కొన్ని లక్షల రూపాయలు ఖర్చుపెట్టి 2012లో అప్పటి, ప్రస్తుత ఎమ్మెల్యే సాంబ శివరావు కొత్తగూడెంలో రామవరం ముర్రేడు వాగు ప్రాంతంలో రూ 22 లక్షల తో సకల సౌకర్యాలతో మేకల వదశాలను ఏర్పాటు చేశారు.
కాల క్రమేనా అక్కడ బోర్ పనిచేయకపోవడం, కింద బండ మొత్తం పగిలిపోవడం నీళ్లు రాక మేకలు కోసే కటిక వాళ్లు, ముస్లిం మైనార్టీ ప్రజలు,మేకల వ్యాపారం చేసేవారు మటన్ వ్యాపారం రోజు కొత్తగూడెం మున్సిపాలిటీలో మటన్ షాపులు నిర్వహించేవాళ్లు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి దగ్గర కోస్తే మున్సిపాలిటీ ఆఫీసర్లు వచ్చి ఫైన్ వేస్తారని భయపడి ఇక్కడ నీళ్లు లేక సరియైన సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
2012లో నిర్మించిన బిల్డింగు అనేక సమస్యల నిలయంగా మారిందన్నారు. ప్రతి ఆదివారం మటన్ షాపులు పెట్టే నిరుపేద ముస్లిం మైనార్టీ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కనీసం మేకలు శుభ్రంగా కడగడానికి బోర్ పని చేయడం లేదని బకెట్లలో ఇంటి దగ్గర నుంచి నీళ్లు తీసుకుని వచ్చి మాంసాన్ని శుభ్రపరుస్తున్నారని, మటన్ కొట్టడానికి కింద గచ్చు మొత్తం పగిలిపోవడం తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కరెంటు లేకపోవడంతో కారు చీకటి తాండవిస్తుందన్నారు.
తక్షణమే కొత్తగూడెం స్పెషల్ ఆఫీసర్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు విద్యాచందన మున్సిపల్ కమిషనర్ ప్రత్యేకమైన శ్రద్ధ వహించి పశువుల సంత పక్కన ఉన్న వదశాలను సందర్శించి, అక్కడ ఉన్న అన్ని సమస్యలు పరిష్కరించాలని, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పిఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.