29-03-2025 10:51:05 PM
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు..
మంచిర్యాల (విజయక్రాంతి): నగరపాలక సంస్థ నస్పూర్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల వేతన బకాయిలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు అన్నారు. శనివారం మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ శివాజీకి వినతి పత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతినెల వేతనాలు అందేలా చూడాలని, పిఎఫ్, ఈఎస్ఐ పెండింగ్ లేకుండా చూడాలని, మౌలిక సదుపాయాలు కార్మికులకు కల్పించాలని కోరారు.
నూతన కమిటీ ఎన్నిక..
ఏఐటీయూసీ అనుబంధ నగరపాలక సంస్థ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాప్, ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ మంచిర్యాల కార్పొరేషన్ పరిధి నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా మేకల దాసు, అధ్యక్షులుగా నాగపూరి రవి, ఉపాధ్యక్షులుగా బొడ్డుపెళ్లి గోపి, ఎండి జాఫర్, గొలుసుల వెంకటస్వామి, సురిమిల్ల సందీప్, ప్రధాన కార్యదర్శిగా కారం గంటి భాస్కర్, సహాయ కార్యదర్శిగా కామెర కళ్యాణ్, చిట్యాల ప్రశాంత్, చింత రాజేష్, కొయ్యల లింగయ్య, కోశాధికారిగా బెక్కం కిరణ్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కన్నూర్ సమ్మయ్య, చిక్కుడు వినయ్, వెల్కటూరి అనిల్, మంతెన సంజీవ్, రేగుంట రాజకుమార్ తో పాటు 18 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి ఖలిందర్ ఆలీ ఖాన్, మున్సిపల్ సంఘం అధ్యక్షులు రవి, కార్యదర్శి భాస్కర్, గోపి, జాఫర్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.