calender_icon.png 3 April, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్లెక్సీలపై హామీ ఇచ్చిన మున్సిపల్ సిబ్బంది

01-04-2025 01:16:09 AM

కరీంనగర్ క్రైమ్, మార్చి31 (విజయక్రాంతి): కరీంనగర్ 14వ డివిజన్ లో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అజీమ్  డివిజన్ ప్రజలకు  ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ దాదాపు 150 కి పైగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అట్టి ఫ్లెక్సీలను కొందరు మున్సిపల్ సిబ్బంది అధికారుల సూచనలు లేకుండానే తొలగించడం జరిగింది. ఇట్టి విషయం పై యువజన కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కు వెళ్లి సంబంధిత అధికారులను విచా రించగా, మేము ఎవ్వరికీ ఫ్లెక్సీలను తొలగిం చమని ఆదేశాలు ఇవ్వలేదని తెలపడం జరిగింది. అయితే  ఫ్లెక్సీ తొలగించిన మున్సిపల్ సిబ్బంది ని విచారించగా ఒక ప్రైవేటు వ్యక్తి తొలగించమని చెప్పడం వలన తొలగించడం జరిగిందని సమాచారం ఇవ్వడగా. ప్రైవేటు వ్యక్తులు చెప్తే ఎలా తొలగిస్తారు అని ప్రశ్నిస్తే, తిరిగి యధాస్థానంలో ఫ్లెక్సీలను అమర్చారు. .