calender_icon.png 20 April, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఆదాయాన్ని పెంచాలి

12-04-2025 12:00:00 AM

కమిషనర్, మున్సిపల్ అడ్మినిస్టేషన్ డైరెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి

చేవెళ్ల , ఏప్రిల్ 11 : పురపాలక సంఘం ఆదాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని కమిషనర్, మున్సిపల్ అడ్మినిస్టేషన్ డైరెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి సూచించారు. శుక్రవారం శంకర్పల్లి మున్సిపల్ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. పట్టణ పరిధిలోని ఇంటి పన్నులు, షాపింగ్ కాంప్లెక్స్‌ల ట్యాక్స్ వాసూళ్లకు సంబంధించి మున్సిపల్ కమిషనర్, సిబ్బందితో ఆమె సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కమిషనర్, మున్సిపల్ అడ్మినిస్టేషన్ డైరెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి మాట్లాడుతూ.. పురపాలక సంఘం ఆదాయ వనరులను పెంచుకోవాలని, పన్ను వసూళ్లలో లక్ష్యం సాధించే దిశగా అధికారులు సిబ్బంది అంకితభావంతో పని చేయాలన్నారు.

అనంతరం సెగ్రిగేషన్ షెడ్లో తడి, పొడి చెత్తతో తయారు చేస్తున్న ఎరువులను పరిశీలించి సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం చిల్డన్స్ పార్కును పరిశీలించి చేపట్టాల్సిన పనులను వివరించారు. ఆమె వెంట మున్సిపల్ అడ్మినిస్టేషన్ జాయింట్ డైరెక్టర్ ఫల్గున్ కుమార్, మున్సిపల్ అడ్మినిస్టేషన్ డిప్యూటీ డైరెక్టర్ వి.సాయినాథ్, శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ యోగేశ్, మున్సిపల్ మేనేజర్, సిబ్బంది తదితరులు ఉన్నారు.