18-03-2025 05:31:11 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని 2వ వార్డు పరిధిలో బీసీ కాలనీలో ఇటీవల నెలకొన్న తాగునీటి సమస్య (బోర్లు ఎత్తిపొస్తుండటం) పలువురు కాలనీ వాసులకు నీటి ఎద్దడి సమస్య ఏర్పడింది. ఈ తాగునీటి సమస్యను అలాగే కాలనిలో నెలకొన్న పారిశుధ్య సమస్యను పరిష్కరించాలని ఇటీవల మున్సిపల్ కమిషనర్ మహేష్ ను కాలనీవాసులు కోరగా స్వయంగా బీసీ కాలనీలో పర్యటించిన కమిషనర్ మహేష్, మున్సిపల్ ఎ.ఇ. వినోద్ తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇచ్చిన హామీ మేరకు మంగళవారం బోర్ ఎత్తిపోకుండా మరమ్మత్తు పనులను ప్రారంభించారు. దీంతో కాలనీ వాసులకు నీటి సమస్యను పరిష్కరించిన అధికారులు రానున్న రోజుల్లో సైతం ఎలాంటి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించినందుకు కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్ మహేష్, మున్సిపల్ ఏఈ వినోద్ లకు కృతజ్ఞతాలను తెలిపారు.