లక్షెట్టిపేట,(విజయక్రాంతి): విజయ క్రాంతి టాబ్లాయిడ్ లో వచ్చిన 'భారీ వర్షం... నీట మునిగిన 15 వార్డు' అనే కథనానికి మున్సిపల్ అధికారులు, తహసిల్దార్ స్పందించారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్, స్థానిక తహసిల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ సిబ్బంది వచ్చి పారుశుద్య కార్మికులతో అక్కడి నీటినంత నాలల్లోకి మళ్లించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ... భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉంది కావున అలాంటి ప్రదేశాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు సమాచారం అందించడంతో సమస్యను పరిష్కరించే విధంగా పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.