calender_icon.png 19 January, 2025 | 10:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ దుకాణాలను తొలగించిన మున్సిపల్ అధికారులు

18-01-2025 09:06:40 PM

మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని మార్కెట్ ఏరియాలో అక్రమంగా నిర్మించిన దుకాణాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ఆర్టీసి బస్టాండ్ ప్రహరీని అనుకొని ఇటీవల కొంతమంది అక్రమంగా టేలాలు ఏర్పాటు చేయగా అక్రమ టేలాలను తొలగించాలని ఫిర్యాదులు రాగ స్పందించిన మున్సిపల్ అధికారులు శనివారం అక్రమ తెలాలను తొలగించారు. ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడారు.ప పట్టణంలో ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.