13-03-2025 10:45:01 AM
రాజేంద్రనగర్,(విజయక్రాంతి): కబ్జాకు గురవుతున్న పార్కు స్థలాన్ని బండ్లగూడ మున్సిపల్ అధికారులు(Bandlaguda Municipal Officers) కాపాడారు. కార్పొరేషన్ పరిధిలోని 8వ వార్డ్ నందుగల భవానీ కాలనీలోని పార్క్ స్థలం, దేవాలయం స్థలం, వాటర్ ట్యాంక్ స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు యత్నించారు. దీంతో స్థానికులు, నాయకులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారి వాణి తమ బృందంతో కలిసి వెళ్లి పార్క్ స్థలం (1034 గజాలు), దేవాలయ స్థలం (600 గజాలు) వద్ద బోర్డులు ఏర్పాటు చేయించారు. అక్కడ త్వరలో అభివృద్ధి పనులు చేపడతామని మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు, నాయకులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.