calender_icon.png 18 January, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆంధకారంలో మున్సిపల్ ఆఫీస్

18-01-2025 12:00:00 AM

  1. సిరిసిల్ల మున్సిపల్‌కు కరెంట్ కట్
  2. బకాయిలతో కరెంట్ నిలిపివేసిన సెస్ అధికారులు
  3. సెల్‌ఫోన్ లైట్లతో అధికారుల సేవలు 
  4. నాలుగున్నర కోట్లు బకాయిలు

సిరిసిల్ల, జనవరి 17(విజయక్రాంతి): ఆంధకారంలో సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ ఉండిపోయింది. సెస్‌కు మున్సిపల్ బకాయి పాడడంతో శుక్రవారం అధికారులు కరెంటు కట్ చేశారు. ఆయా అవసరాల కోసం వచ్చి న పట్టణ వాసులకు సెల్‌ఫోన్‌ల లైట్ వెలుగుల మధ్య సేవలు అందించారు. కరెం ట్ బకాయిలు చెల్లించడం లేదంటూ సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి సెస్ అధికారు లు శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేశా రు.

దాంతో అంధకారంలోనే మున్సిపల్ అధికారులు, సిబ్బంది కార్యకలాపాలు నిర్వ హిస్తున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవ డంతో మున్సిపల్ ఉద్యోగులు కంప్యూటర్, ఇంటర్నెట్ సేవలను  వినియోగించుకో లేకపోతున్నారు. కాగా ఇప్పటికే సెస్‌కు సిరిసిల్ల మున్సిపల్ రూ.4 కోట్ల, 58 లక్షల, 90 వేల, 749 రూపాయల విద్యుత్ బకాయిలు ఉన్నట్లు సెస్ అధికారులు తెలి పారు.

గత సంవత్సరం డిసెంబర్‌లో, ఈ ఏడాది జనవరి నెల మొదటి వారంలో మున్సిపల్ కార్యాలయానికి బకాయిలు చెల్లించాలని సెస్ అధికారులు నోటీసులు పంపించారు. దానికి సిరిసిల్ల మున్సిపాలిటీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆఫీస్‌లో ఉన్నా కరెంట్ ఫిజులు తీసుక వేళ్లారు. దీంతో ఆఫీస్ మంతా ఆంధకారం అయింది. మున్సిపల్‌కు కరెంట్ కట్ విష యం స్థానికంగా చర్చనీయాంశమైంది.