calender_icon.png 30 September, 2024 | 10:51 PM

10 కోట్లకు అమ్మకానికి మున్సిపల్ స్థలం?

30-09-2024 01:22:40 AM

ఆదిలాబాద్‌లో నకిలీ పట్టాతో కబ్జా!

బట్టబయలు చేసిన కౌన్సిలర్

ఆదిలాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ఆదిలాబాద్ పట్ణణంలోని మున్సి పల్ స్థలాన్ని నకిలీ పట్టాత సృష్టించి కాజేసి, రూ.10 కోట్లకు అమ్మకానికి పెట్టినట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్ని ఓ కౌన్సిలర్ బయ టపెట్టారు. 49వ వార్డు భూక్తాపూర్ కాలనీలోని మున్సిపల్ లీజ్ స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు.

సుమారు 8 చదరపు అడుగుల లీజు స్థలంపై ఆక్రమణదారులు కన్నేశా రు. 2021లో మున్సిపల్ పాలకవర్గం పార్క్ నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించారు. సుమారు రూ.20 లక్షలతో పార్కు నిర్మా ణం చేపట్టాలనుకున్నా నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు చేపట్టలేదు. దీంతో ఖాళీగా ఉన్న స్థలంపై అక్రమార్కులు కన్నేశారు.

1983లో అప్పటి మున్సిపల్ చైర్మ న్ లక్ష్మణ్‌రావు పాలకవర్గం నుంచి 6 వేల చ దరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుని, మున్సిపాలిటీ అసెస్మెంట్‌తో పాటు ఇంటి న ంబర్ సైతం తీసుకున ్నట్టు మహమ్మద్ అబ్దు ల్ షమీ అనే వ్యక్తి గ తేడాది నకిలీ పట్టాను సృష్టించాడు. తాజాగా ఈ స్థలాన్ని రూ.10 కోట్లకు అమ్ముతున్నారని ప్రచారం జరగడం తో స్థలం కబ్జాకు గురైందన్న విషయం బయటపడింది.

కబ్జా తతంగాన్ని బయటపెట్టిన కౌన్సిలర్

49వ వార్డులోని మున్సిపల్ స్థలం కబ్జా కు గురైందని ఆ వార్డ్ కౌన్సిలర్ వెనగంటి ప్రకాశ్ గుర్తించారు. ఆక్రమణదారులు స్థలం కబ్జా చేయడంతో పాటు నకిలీ పట్టాను సృష్టించిన విషయాన్ని కౌన్సిలర్ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.  స్థలాన్ని ఆక్రమించిన మహమ్మద్ అబ్దుల్ షమీతో పాటు అసెస్మెంట్, ఇంటి నంబర్ ఇవడానికి సహకరించిన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ డిమాండ్ చేశారు.