calender_icon.png 24 November, 2024 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతి లేని నిర్మాణాలపై మున్సిపల్ శాఖ కొరడా

25-09-2024 04:46:24 PM

పటాన్ చెరు, (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 1056 సిబిఆర్ కాలనీలో అనుమతులకు మించి నిర్మించిన రెండు అంతస్తులను బుధవారం మున్సిపల్ శాఖ అధికారులు తొలగించారు. జీ ప్లస్ టు అనుమతి తీసుకుని అదనంగా మూడు అంతస్థులు నిర్మించడంతో ఇటీవల పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఇంటి యజమానికి నోటీసులు అందించారు. మున్సిపల్ పరిధిలో అనుమతులకు మించి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి తెలిపారు.