calender_icon.png 18 April, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాపర్టీ టాక్స్ వసూళ్లపై మున్సిపల్ కమిషనర్లకు ప్రశంసలు

04-04-2025 12:35:01 AM

సిద్దిపేట అర్బన్ / హుస్నాబాద్, ఏప్రిల్ 3:  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్లు  మల్లికార్జున్, ఆశ్రిత్ కుమార్  ఆస్తి పన్ను వసూళ్లలో ఉత్తమ పనితీరును కనబరచడంతో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఆస్తి పన్ను వసూలును సమర్థవంతంగా నిర్వహించడంతో వారిని గురువారం సీడీఎంఏ శ్రీదేవి ప్రశంసాపత్రాన్ని ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా మున్సి పల్ కమిషనర్లు మాట్లాడుతూ ఈ ప్రశంసాపత్రం తమ ఒక్కడికే కాదని, మున్సిపల్ ఉద్యోగులు,

సిబ్బంది అందరి కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని అన్నారు. అంతేకాకుండా, హుస్నాబాద్, సిద్దిపేట ప్రజల సహకారం కూడా మరువలేనిదన్నారు. ఉన్నతాధికారుల ప్రశంసలతో తమ బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తామని వారన్నారు. జిల్లాలోని  కమిషనర్లకు ప్రశంసా పత్రం రావడంపై హుస్నాబాద్, సిద్దిపేట మున్సిపాలిటీ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.