calender_icon.png 27 November, 2024 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వసతి గృహాన్ని తనిఖీ చేసిన మున్సిపల్ కమీషనర్

27-11-2024 05:31:22 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని స్థానిక దళిత అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహాన్ని బుధవారం మున్సిపల్ కమీషనర్ కల్లెడ రాజశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో పలు రకాల రిజిస్టర్స్ ను పరిశీలించారు. మొత్తం విద్యార్థులు, సిబ్బంది సంఖ్య గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. అదే విధంగా విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై పలు రకాల డేటా తీసుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంబంధిత డేటాను ఆన్లైన్ లో పొందుపరుస్తున్నట్లు ఆయన వివరించారు. వసతి గృహ విద్యార్థుల సంఖ్య, మెనూ ప్రకారం భోజనం, పరిశుభ్రత ఇతర వివరాలను పొందుపరుస్తున్నట్లు ఆయన తెలిపారు.

అంతకుముందు వసతి గృహాంలో స్టోర్ రూమ్ లో సరుకులు, వంటగదితో పాటు బాత్ రూమ్ లను కూడా పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని వసతి గృహ సంక్షేమాధికారి రాజుకు సూచించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రతపై కూడా దృష్టి పెట్టి వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మందులు అందుబాటులో ఉన్నాయా? అని హేచ్ డబ్ల్యూ ఓ ను అడిగి ప్రభుత్వ ఆసుపత్రి మందులను మాత్రమే వాడాలని సూచించారు. అంటువ్యాధులు రాకుండా పరిశుభ్రత కోసం విద్యార్థులకు శానిటైజర్ లను కూడ అందుబాటులో ఉంచాలన్నారు. మెనూ పట్టిక పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. అనంతరం వసతి గృహ సంక్షేమాధికారి రాజు హాస్టల్ బయట పరిసరాల్లో మురికి కాల్వ, చెత్త తొలగింపుపై కమీషనర్ దృష్టికి తీసుకు వెళ్లగా వెంటనే మున్సిపల్ సిబ్బందితో ఆయా పరిసరాలను అప్పటికప్పుడు కమీషనర్ శుభ్రం చేయించారు. ఈ ఆకస్మిక తనిఖీలో మున్సిపల్ కమీషనర్ రాజశేఖర్ వెంట హెచ్ డబ్ల్యూ ఓ రాజు, హాస్టల్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.