స్వల్పంగా ధ్వంసమైన కారు...
ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్(Municipal Commissioner CH Srikanth) కు శుక్రవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. ఇల్లందు నుంచి కొత్తగూడెంకు కారులో వెళ్తుండగా టేకులపల్లి మండలం 9వ మైల్ తండా వద్ద లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా కమిషనర్ కారును ఢీకొంది. ఈ ఘటనలో కమిషనర్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని, కేవలం కారు కొంతమేర ధ్వంసమైంది. ఈ ఘటనలో మున్సిపల్ కమిషనర్ కు ఎటువంటి ప్రమాదం జరగలేదు.