calender_icon.png 28 November, 2024 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలి

28-11-2024 06:49:09 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని  వ్యాపారుస్తులతో గురువారం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా ఇల్లందు పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో మున్సిపల్ కార్యాలయంలో వ్యాపారస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించామన్నారు. ఇల్లందు పట్టణంలో ప్లాస్టిక్ రహిత పట్టణంగా ఇల్లందు పట్టణాన్ని తీర్చిదిద్దేందుకు వ్యాపారస్తులు అందరు సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ జీవనానికి అత్యంత ప్రమాదకరమని తెలిపారు. అనంతరం కమిషనర్ శ్రీకాంత్  మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాని తగ్గించేందుకు  ఇల్లందు పట్టణమంతా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం చేస్తామని  తెలిపారు. కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్  శానిటరీ ఇన్స్పెక్టర్, తదితరులు పాల్గొన్నారు.