25-04-2025 05:37:31 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గుగులోత్ వీరు నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి(Municipal Commissioner Prasanna Rani) ప్రారంభించారు. వేసవికాలంలో బాటసారుల దాహార్తి తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల వీరు నాయక్ ను అభినందించారు. సాంఘిక సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ధనసరి సొసైటీ డైరెక్టర్ కొండ్రెడ్డి రవీందర్ రెడ్డి, ఆత్మ చైర్మన్ నెహ్రూ రెడ్డి, మాజీ సర్పంచ్ సట్ల నర్సయ్య, మాజీ ఉప సర్పంచ్ భద్రు నాయక్, రాజేష్, రుద్ర శ్రీకాంత్, భీమా నాయక్, వార్డ్ ఆఫీసర్ సింగిని ప్రభాకర్, సంతోష్ పాల్గొన్నారు.