12-04-2025 09:03:00 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో నేడు జరగబోయే హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా శనివారం ఉదయం ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్, ఎస్ఐ బొజ్జ మహేష్, మున్సిపల్ కమిషనర్ మహేష్, ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ వెంకట చారి, శశికాంత్ కలిసి పప్పు హనుమాన్ మందిరం నుండి గాంధీచౌక్ వరకు రూట్ పరిశీలించారు. ర్యాలీ ప్రశాంతంగా జరుపుకోవాలని బజరంగ్ దళ్ నాయకులను పోలీస్ శాఖ వారు సూచించారు. ర్యాలీలో పాల్గొనేవారు ర్యాలీ పూర్తి అయ్యేవరకు పోలీసులకు, భద్రత సిబ్భందికి సహకరించాలని కోరారు. ఎవరైన ఆటంకం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.