calender_icon.png 16 March, 2025 | 2:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటి నెంబర్ ను రద్దు చేసిన మున్సిపల్ కమిషనర్

16-03-2025 09:40:48 AM

విజయ క్రాంతి ఎఫెక్టు

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ పట్టణంలో అసంపూర్తి భవనానికి తప్పుడు నివేదికల ద్వారా నెంబరు పొందారంటూ మున్సిపల్ కమిషనర్ సుజాత శనివారం ఆ ఇంటి నెంబర్ ను రద్దు చేశారు. ఇటీవల విజయ క్రాంతిలో ప్రచురితమైన పాల్వంచలో అక్రమాల దందా వార్తకు స్పందించిన కమిషనర్ ఇంటి నెంబర్ జారీ పై విచారణ నిర్వహించారు. భవన నిర్మాణం అసంపూర్తిగా ఉన్నట్లుతేట తెల్లం కావడంతో జారీ చేసిన ఇంటి నెంబర్ను రద్దు చేశారు. ఆ అక్రమార్కులు సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా ఇంటి నెంబర్ పొందియున్నారు.

తప్పుడు సమాచారంతో అధికారులను మోసం చేస్తే నూతన పురపాలక చట్టం సెక్షన్ 178,181, 185ల ప్రకారం... అనుమతి, ఆమోదం లేక నిర్మించిన నిర్మాణాలను కూల్చి వేయుటకు, అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరైనా మూడు సంవత్సరాల వరకు విస్తరింప గల కాల వ్యవధి కారాగారముతోను, భూమి, భవనము ఉపయోగించినప్పుడు రిజిస్ట్రేషన్ శాఖచే నిర్ధారించినట్లుగా భూమితో సహా భవనం యొక్క వెలువల్లో 25 శాతం జరిమానాతో శిక్షించబడుతుంది. 2021 సెప్టెంబర్ లో కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన భారీ భవన యజమానికి ఇదే తరహాలో నోటీసు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. పాల్వంచ పట్టణంలో ఆ చట్టాన్ని అధికారులు అమలు చేస్తారా లేదు వేచి చూడాల్సి ఉంది.