calender_icon.png 1 March, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.30 లక్షల ఆస్తి పన్నులు వసూలు చేసిన మున్సిపల్ అధికారులు

01-03-2025 07:17:40 PM

నిజామాబాద్,(విజయక్రాంతి): నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని బకాయిలు ఉన్న ఆస్తి పన్ను క్రమం తప్పకుండా చెల్లించాలని కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను బకాయిల వస్తువులకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా పలు దుకాణాల యజమానుల నుండి రూ.30 లక్షల మేరకు ఆస్తి పన్ను వసూలు చేశారు. నిజామాబాద్ లోని స్వాగత్ హోటల్లో ఆహార నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్ ఆర్యులు బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.