లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
వనపర్తి, అక్టోబర్ 22 (విజయక్రాంతి): వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు మంగళవారం కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారు లు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ ఇన్‌చార్జి డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. పెబ్బేరు మున్సిపల్ కార్యాలయంలో కాం ట్రాక్టర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి గత ఎనిమిది నెలల క్రితం పలు వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టాడు.
ఒక్కో యూనిట్‌కు రూ.83,930లుగా నిర్ణయించి మొత్తం నాలుగు పనులకు రూ.3,35,000 బిల్లుల విడుదల కోసం మున్సిపల్ కమిషనర్ ఆదిశేషును సంప్రదించాడు. బిల్లు మంజూరు కోసం కమిషనర్ రూ.25వేల లంచం డిమాండ్ చేయగా రూ.20 వేలకు కాంట్రాక్ట ర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.
అనంతరం కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనతో మంగళవారం మధ్యాహ్నం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్‌కు లంచం డబ్బులను ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారకు. కమిషనర్ ఆదిశేషును నాంపల్లి కోర్టు లో హాజరుపరుస్తున్నట్లు ఇన్‌చార్జి డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు.