కామారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ సలహదారు షబ్బీర్‌ఆలీ, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్‌కు హైదారాబాద్‌లో బుధవారం మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియా చంద్రశేఖర్ రెడ్డిలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. షబ్బీర్‌ఆలీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియా మాట్లాడుతూ.. కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాత శివకృష్ణమూర్తి, చాట్ల వంశీకృష్ణ, మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.