calender_icon.png 9 January, 2025 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సావిత్రిబాయి పూలే నేటి మహిళా లోకానికి ఆదర్శనీరాలు

03-01-2025 03:07:22 PM

మంథని,(విజయక్రాంతి): సావిత్రిబాయి పూలే నేటి మహిళా లోకానికి ఆదర్శనీరాలని మంతిని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రూ రమాదేవి(Manthani Municipal Chairperson Ramadevi) అన్నారు. సావిత్రిబాయి  పూలే(Savitribai Phule) జయంతి సందర్భంగా శుక్రవారం మంథని మున్సిపల్  కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ రమాదేవి సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ రమాదేవి మాట్లాడుతూ... సమాజంలోని అన్ని వర్గాల బాలిక, మరియు మహిళల విద్య కొరకు సావిత్రిబాయి అహర్నిశలు కృషి చేయడం జరిగిందన్నారు. భారతదేశ  తొలి మహిళ ఉపాధ్యాయురాలు, సామాజిక వేత్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీపతి బాణయ్య, కౌన్సిలర్స్ కుర్ర లింగయ్య, చొప్పకట్ల హనుమంతు, వి.కె రవి, మున్సిపాల్ సిబ్బంది  పాల్గొన్నారు.