calender_icon.png 22 December, 2024 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణపతి నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్

16-09-2024 03:05:51 PM

మంథని(విజయక్రాంతి): మంథని గోదావరి ఘాట్  వద్ద  మరమ్మత్తులు చేయించి నిమజ్జనం కోసం భారీ క్రేను ఏర్పాటు తో పాటు రెస్క్యూ టీం గజ ఈతగాళ్ళని కూడా నియమించామని, శోభాయాత్ర జరిగే రహదారుల పొడుగునా పారిశుద్ధ్య కార్యక్రమాల, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశామని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి  తెలిపారు. సోమవారం. ఆమె మాట్లాడుతూ ప్రజలు భక్తి భావంతో  శోభయాత్ర నడిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ గుండా విజయలక్ష్మి -పాపారావు, కొట్టే పద్మ- రమేష్, చుప్పకట్ల హనుమంత్, , కమిషన్ గుట్టల మల్లికార్జున స్వామి, ఎస్సై రమేష్, మున్సిపల్ సిబ్బంది   తదితరులు పాల్గొన్నారు.